హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ లాగినా.. నిఫ్టీకి రిలయన్స్, ఎల్టీ దన్ను భారత స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయి. జపాన్, ఆస్ట్రేలియా మార్కెట్లు తగ్గినా చైనా, కొరియా, తైవాన్ పెరగడం మదుపర్లలో ఆత్మవిశ్వాసం పెంచాయి. ఫెడ్ అత్యధిక వడ్డీరేట్ల కొనసాగింపు, క్రూడాయిల్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ దేశీయ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండటం, గ్రోత్ రేట్, ఫలితాల సీజన్ మొదలవ్వడం పాజిటివ్ సెంటిమెంటుకు దారితీసింది. దాంతో ఉదయం ఫ్లాట్‌గా మొదలైన సూచీలు మధ్యాహ్నం గరిష్ఠాలకు చేరుకున్నాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 51, బీఎస్ఈ సెన్సెక్స్ 173 పాయింట్లు ఎగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఫ్లాట్‌గా 83.23 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు డిఫెన్సివ్ స్టాక్స్ వైపు మొగ్గు చూపారు. ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్లను కొనుగోలు చేస్తున్నారు. క్రితం సెషన్లో 65,945 వద్ద ముగిసిన బీఎస్ఈ సెన్సెక్స్ నేడు 65,925 వద్ద మొదలైంది. 65,549 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,172 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 173 పాయింట్ల...
Comments
Post a Comment